ప్రభాస్ నుంచి మూడో వరల్డ్ లెవెల్ ప్రాజెక్ట్ గా ఇది?

Published on Sep 24, 2021 12:00 pm IST


పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు పలు భారీ బడ్జెట్ చిత్రాలు నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.. మరి ఏకకాలంలో ఈ రెండు సినిమాలు చేస్తుండగా “రాధే శ్యామ్” ఆల్రెడీ కంప్లీట్ అయ్యింది. అయితే వీటి తర్వాత కూడా ప్రభాస్ నుంచి నెవర్ బిఫోర్ లైనప్ కూడా సిద్ధం అయ్యింది. అయితే వాటిలోనే ఇప్పుడు “సలార్” చేస్తున్న సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో మున్ముందు మరో సిసలైన ప్రాజెక్ట్ వీరి నుంచి ఉంది.

అయితే ఈ చిత్రంపై కూడా మరో ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. దాని ప్రకారం భారీ పీరియాడిక్ వండర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా కూడా పాన్ వరల్డ్ లెవెల్లో రిలీజ్ కానున్నట్టు తెలుస్తుంది. మరి ఇది కనుక నిజం అయితే ఇది మూడోది బహుశా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ నాగ్ అశ్విన్ తో ప్రాజెక్ట్ వరల్డ్ లెవెల్లోనే రిలీజ్ అని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఇంకా ఆదిపురుష్ ని కూడా చేసే అవకాశం ఉందని టాక్ ఉంది. సో ప్రభాస్ నుంచి మరో వరల్డ్ లెవెల్ ప్రాజెక్ట్ లోడింగ్ కి ఉందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :