తలైవర్ రజినీ లైనప్ లోకి మరో యంగ్ దర్శకుడు..!

Published on Feb 20, 2022 12:03 pm IST


ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఒక సరైన హిట్ పడితే చూడాలని రజినీ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తన లైనప్ లో ఇంట్రెస్టింగ్ దర్శకుల పేర్లే వచ్చినా వారిలో కోలీవుడ్ స్టార్ దర్శకుడు శివ “పెద్దన్న” తో బాగా నిరాశ పరిచాడు.

అలాగే ఇంకో పక్క మరింత మంది యంగ్ దర్శకులకు రజినీ అవకాశం ఇస్తున్నారు. మరి తన కెరీర్ లో 169వ సినిమాగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కి అవకాశం ఇవ్వగా అది రీసెంట్ గానే అనౌన్సమెంట్ కూడా జరిగింది. ఇక ఇప్పుడు అయితే తలైవర్ 170వ సినిమాగా ఓ మల్టీ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ కి అవకాశం ఇచ్చినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది.

అతడే అరుణ్ రాజా కామరాజ్. దర్శకునిగా రెండు సినిమాలు మాత్రమే చేసిన ఈ యంగ్ దర్శకునికి తాను అవకాశం ఇవ్వడం ఇప్పుడు కోలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతుంది. అలాగే ఈ చిత్రాన్ని బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :