‘ఇండియన్ 2’ లో మరో యంగ్ హీరో ?

Published on May 1, 2023 9:42 pm IST

విజువల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ భారతీయుడు 2. కాగా ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ ఉంది. ఇప్పుడు ఈ రోల్ లో ఓ యంగ్ తెలుగు హీరో కనిపించే ఛాన్స్ ఉంది. యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండకి శంకర్ అవకాశం ఇచ్చాడని.. నెగిటివ్ షేడ్స్ ఉన్న ఈ క్యారెక్టర్ కి కార్తికేయ గుమ్మకొండ అయితే బాగుంటుందని అతన్ని తీసుకున్నారట. కార్తికేయ గతంలో అజిత్ హీరోగా వచ్చిన వలిమై చిత్రంలో కూడా విలన్ గా నటించాడు.

అలాగే నాని గ్యాంగ్ లీడర్ లో కూడా కార్తికేయ విలన్ గా నటించాడు. కాగా ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ‘భారతీయుడు 2’లో కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ కూడా మరో కీలక పాత్రలో నటిస్తోంది. ఇక భారతీయుడు 2 చిత్రాన్ని ఈ ఏడాది జూన్ నాటికి షూటింగ్ అంతా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :