“జెంటిల్మాన్ 2” లో మరో యంగ్ హీరోయిన్ ఫిక్స్.!

Published on Apr 13, 2022 4:00 pm IST

ఇండియాస్ జేమ్స్ కేమరూన్ శంకర్ తెరకెక్కించిన భారీ హిట్ సినిమాల్లో యాక్షన్ కింగ్ అర్జున్ తో తీసిన బ్లాక్ బస్టర్ సోషల్ డ్రామా “జెంటిల్మాన్” సినిమాకి గాను ఆ సినిమా నిర్మాత కుంజుమోన్ సీక్వెల్ ని పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కించాలని ప్లాన్ చేశారు.

మరి గత కొన్నాళ్ల నుంచి ఒక్కో అప్డేట్ ని మేకర్స్ రివీల్ చేస్తూ వస్తుండగా నిన్ననే ఈ సినిమాలో మరో హీరోయిన్ ఎవరో అనేది రివీల్ చేస్తున్నట్టుగా అప్డేట్ ఇచ్చారు. మరి ఇప్పుడు ఆ హీరోయిన్ ని కూడా అనౌన్స్ చేశారు. ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా యంగ్ నటి ప్రియా లాల్ ని తీసుకొచ్చినట్టు తెలిపారు.

మరి ప్రస్తుతానికి అయితే ఈ భారీ సినిమాకి అంతా కొత్త క్యాస్టింగ్ నే తీసుకొస్తున్న చిత్ర యూనిట్ మున్ముందు హైప్ కి ఎలాంటి క్యాస్ట్ ని తీసుకొస్తారో చూడాలి. మరి ఈ సినిమాకి అయితే ఎం ఎం కీరవాణి సంగీతం అందివ్వనున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :