రాజమౌళిని వరించిన మరో పురస్కారం !


కెరీర్లో ఫైల్యూర్ అనేదే లేకుండా ఎప్పటికప్పుడు భారీ విజయాల్ని అందుకుంటూ ‘బాహుబలి’ సిరీస్ తో దేశంలోని అగ్ర దర్శకుల జాబితాలో చేరి అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీని అందుకున్న దర్శక ధీరుడు రాజమౌళి ఇప్పుడు మరో పురస్కారానికి ఎంపికయ్యారు. తెలుగు పరిశ్రమలోని ఉత్తమ పురస్కరాల్లో ఒకటైన అక్కినేని అవార్డుకు ఆయన ఎంపికయ్యారు.

సినీ పరిశ్రమలో జక్కన్న చూపిన సమర్థకు ఆయన్ను 2017 సంవత్సరానికి గనుఁ అక్కినేని అవార్డుకు ఎంపిక చేశామని నాగార్జున స్వయంగా తెలిపారు. సెప్టెంవర్ 17 సాయంత్రం జరగనున్న ఈ వార్డుల ప్రధానోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుగారు ముఖ్య అతిధిగా పాల్గొని అవార్డుల్ని బహుకరించనున్నారు.