నాని “అంటే సుందరానికీ” ఫస్ట్ వీక్ కలెక్షన్లు ఎంతంటే..!

Published on Jun 18, 2022 3:00 am IST

నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ “అంటే సుందరానికీ”. నాని సరసన మలయాళ బ్యూటీ నజ్రియా ఫహద్ నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని మరియు వై రవి శంకర్‌లు నిర్మించిన ఈ చిత్రంలో నాని ఓ బ్రాహ్మణ కుర్రాడిగా, నజ్రియా క్రిస్టియన్‌ అమ్మాయిగా జోడి కట్టారు. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్‌ 10న విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను సంపాదించుకుంది.

అయితే ఈ సినిమా మొదటి వారం హిట్ టాక్‌తో దూసుకెళ్లినా ఆ తర్వాత మాత్రం కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. ఈ సినిమా ఫస్ట్‌ వీక్‌ పూర్తయ్యే సరికి వరల్డ్‌వైడ్‌గా రూ.18.39 కోట్ల షేర్ వసూళ్లు రాబట్టగా, రూ.32.60 కోట్లు గ్రాస్ వచ్చింది. ఏరియాలా వారీగా ఈ మూవీ మొదటి వారం కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే..

నైజాం – రూ.5.58 కోట్లు
సీడెడ్‌ – రూ.1.13 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ.1.33 కోట్లు
ఈస్ట్‌ – రూ.0.93 కోట్లు
వెస్ట్‌ – రూ.0.79 కోట్లు
గుంటూరు – రూ.0.87 కోట్లు
కృష్ణా – రూ.0.84 కోట్లు
నెల్లూరు – రూ.0.58 కోట్లు
ఏపీ, తెలంగాణ మొత్తం కలిపి – రూ.12.05 కోట్లు (రూ.20.40 కోట్లు గ్రాస్‌)
కర్ణాటకతోపాటు దేశవ్యాప్తంగా – రూ.1.34 కోట్లు
ఓవర్సీస్‌ – 5 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా – రూ.18.39 కోట్లు (రూ.32.60 కోట్లు గ్రాస్‌)

సంబంధిత సమాచారం :