యూఎస్ లో అదరగొడుతున్న “అంటే సుందరానికీ” కలెక్షన్.!

Published on Jun 11, 2022 8:02 am IST


నాచురల్ స్టార్ నాని హీరోగా నజ్రియా ఫహద్ హీరోయిన్ గా యంగ్ దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “అంటే సుందరానికీ”. మంచి అంచనాలు నడుమ రిలీజ్ అయ్యిన ఈ చిత్రం ఓవర్సీస్ లో పడ్డ ఫస్ట్ ప్రీమియర్స్ నుంచే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోగా మన తెలుగు స్టేట్స్ లో కూడా ఈ చిత్రం పాజిటివ్ టాక్ ని తెచ్చుకొని స్ట్రాంగ్ గా నిలబడుతుంది.

ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం అయితే యూఎస్ లో మాత్రం మంచి ఓపెనింగ్స్ ని అందుకున్నట్టుగా తెలుస్తుంది. ఫస్ట్ డే మార్నింగ్ షో మరియు ప్రీమియర్స్ కి గాను ఈ చిత్రం 3 లక్షలకి పైగా సాలిడ్ మార్క్ ని దాటేసింది అట. ఇక రెండో రోజుకి ఈజీగా 3 లక్షల 50 వేల మార్క్ ని దాటేస్తుంది అని చెప్పాలి. ఆల్రెడీ నాని కెరీర్ లోనే సెకండ్ బెస్ట్ ఓపెనింగ్స్ ఈ సినిమాకి దక్కాయని తెలుస్తుంది. ముందు పెద్దగా బజ్ లేదనే మాట కూడా స్ప్రెడ్ అయ్యింది కానీ నాని అయితే అది తప్పని ప్రూవ్ చేసాడని చెప్పాలి.

సంబంధిత సమాచారం :