1 మిలియన్ క్లబ్ కి అతి చేరువలో “అంటే సుందరానికీ”.!

Published on Jun 17, 2022 10:00 am IST


నాచురల్ స్టార్ నాని హీరోగా నజ్రియా ఫహద్ హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “అంటే సుందరానికీ”. క్లీన్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఆకట్టుకుంటున్న ఈ చిత్రం డీసెంట్ వసూళ్లను నమోదు చేసింది. అయితే యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం మంచి వసూళ్లనే అందుకుంది.

అలా వీక్ డేస్ లోకి వచ్చాక అయితే కాస్త స్లో అయ్యింది కానీ 1 మిలియన్ డాలర్స్ మార్క్ ని అయితే ఈ చిత్రం అందుకోవడం గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం అయితే ఈ రెండు రోజుల్లో 1 మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరనున్నట్టు తెలుస్తుంది. దీనితో మన టాలీవుడ్ నుంచి హీరోస్ నుంచి అయితే అత్యధిక 1 మిలియన్ డాలర్ సినిమాలు ఉన్న హీరోగా నాని కూడా టాప్ 5 లో నిలిచాడు.

సంబంధిత సమాచారం :