1 మిలియన్ డాలర్స్ కి దగ్గరలో “అంటే సుందరానికి”.!

Published on Jun 15, 2022 8:10 am IST

నాచురల్ స్టార్ నాని హీరోగా నజ్రియా ఫహద్ హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “అంటే సుందరానికి”. ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం తెలుగు స్టేట్స్ లో డీసెంట్ వసూళ్లను అందుకుంటుండగా ఓవర్సీస్ లో మాత్రం సాలిడ్ వసూళ్లనే రాబడుతుంది. మరి యూఎస్ బాక్సాఫీస్ దగ్గర అయితే ఈ చిత్రం ఇప్పుడు 1 మిలియన్ డాలర్స్ వసూళ్ల దిశగా వెళ్తుంది.

లేటెస్ట్ గా ఈ చిత్రం 9 లక్షల డాలర్స్ మార్క్ ని క్రాస్ చెయ్యగా ఈ రెండు రోజుల్లో రికార్డ్ మైల్ స్టోన్ 1 మిలియన్ డాలర్స్ ని క్రాస్ చేయనుంది. దీనితో నాని కెరీర్ లో మరో 1 మిలియన్ సినిమా చేరనుండగా మన టాలీవుడ్ నుంచి అయితే అత్యధిక 1 మిలియన్ డాలర్ వసూళ్లు ఉన్న అతి కొద్ది మంది హీరోల్లో నాని ఒకడిగా నిలిచాడు. ఇక ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :