యూఎస్ లో సాలిడ్ గా దూసుకెళ్తున్న “అంటే సుందరానికి”.!

Published on Jun 12, 2022 7:07 am IST

నాచురల్ స్టార్ నాని మరియు మరియు మరో నాచురల్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ నజ్రియా ఫహాద్ లు హీరో హీరోయిన్ లుగా దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబోలో తెరకెక్కించిన లేటెస్ట్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “అంటే సుందరానికి”. అయితే ఈ చిత్రం డీసెంట్ బజ్ నడుమ మొన్ననే రిలీజ్ కాగా ఇప్పుడు ఈ చిత్రం యూఎస్ బాక్సాఫీస్ దగ్గర అయితే సూపర్ సాలిడ్ గా నిలబడుతూ దూసుకెళ్తుంది అని చెప్పాలి.

నిన్ననే హాఫ్ మిలియన్ మార్క్ ని క్రాస్ చేసేసిన ఈ చిత్రం ఇంకా అక్కడ వీకెండ్ కంప్లీట్ కాకుండానే 6 లక్షలకు పైగా డాలర్ల ని రాబట్టేసింది. దీనితో ఈ స్పీడ్ చూస్తుంటే నాని కెరీర్ లో ఈ చిత్రం మరో 1 మిలియన్ డాలర్ సినిమా గా నిలుస్తోంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందివ్వగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :