యూఎస్ లో మంచి నంబర్ తో స్టార్ట్ అయ్యిన “అంటే సుందరానికి”.!

Published on Jun 10, 2022 8:00 am IST


నాచురల్ స్టార్ నాని హీరోగా తన గత సూపర్ హిట్ చిత్రం శ్యామ్ సింగ రాయ్ కి పూర్తి భిన్నంగా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వివేక్ ఆత్రేయ తో చేసిన లేటెస్ట్ చిత్రం “అంటే సుందరానికి”. మళయాళ బ్యూటీ నజ్రియా తెలుగులో పరిచయం అవుతూ వచ్చిన ఈ చిత్రం ఫైనల్ గా ఈరోజు నుంచి థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది.

అయితే అల్రెడీ పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్న ఈ చిత్రం యూఎస్ బాక్సాఫీస్ దగ్గర మంచి నెంబర్ తో ఫస్ట్ డే స్టార్ట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా ప్రీమియర్స్ తో 2 లక్షల డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసి అదరగొట్టింది. ఎలాగో అక్కడ పాజిటివ్ టాక్ వినిపిస్తుంది కాబట్టి వారాంతంలో మరింత మంచి వసూళ్లు వస్తాయని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :