ఇక్కడ మాత్రం స్లో గా స్టార్టైన “అంటే సుందరానికి”..!

Published on Jun 11, 2022 6:02 pm IST

నాచురల్ స్టార్ నాని హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ నజ్రియా ఫహద్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “అంటే సుందరానికి” చిత్రం నిన్న డీసెంట్ బజ్ నడుమ రిలీజ్ అయ్యిన సంగతి తెలిసిందే. దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ చిత్రం నాని కెరీర్ లో మంచి హైప్ తో ఉన్న సినిమాగా స్టార్ట్ అయ్యింది కానీ తెలుగు స్టేట్స్ లో మాత్రం అనుకోని విధంగా స్లో బుకింగ్స్ ని నమోదు చేసుకుంది.

దీనితో మొదటి రోజు అయితే ఈ సినిమాకి కాస్త తక్కువ ఓపెనింగ్స్ నమోదు అయ్యినట్టు టాక్ ఉంది. కాకపోతే సినిమాకి మంచి టాక్ కూడా సంతరించుకుంది కాబట్టి ఈ వారాంతంలో అయితే మంచి నంబర్స్ తెలుగు రాష్ట్రాల్లో నమోదు చేసే అవకాశం ఉంది. మరి చూడాలి ఈ రెండు కీలక రోజులు ఈ సినిమాకి ఎలాంటి వసూళ్లు వస్తాయో అనేది. ఇక ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :