రిలీజ్ కి రెడీ అవుతున్న “యాంట్ మ్యాన్ అండ్ ద వాస్ప్ క్వాంటుమనియా”

Published on Feb 13, 2023 1:50 pm IST

పేటన్ రీడ్ దర్శకత్వం లో పాల్ రూడ్, ఎవాంజెలిన్ లిల్లీ, జోనాథన్ మేజర్స్, మిచెల్ ఫై ఫెర్, మైకేల్ డగ్లస్, కాథరిన్ న్యూటన్, కేటి ఒబ్రియాన్, డేవిడ్, విలియం జాక్సన్ హార్పర్, బిల్ ముర్రే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం యాంట్ మ్యాన్ అండ్ ద వాస్ప్ క్వాంటుమనియా. ఈ చిత్రం కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఈ చిత్రంను ఫిబ్రవరి 17, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. సూపర్ హీరోలు స్కాట్ లాంగ్ మరియు హోప్ వాన్ డైన్ లు యాంట్ మ్యాన్ అండ్ ద వాస్ప్ గా తిరిగి వచ్చారు. వీరు, వీరి కుటుంబం కలిసి క్వాంటమ్ రాజ్యాన్ని అన్వేషిస్తుంది. ఈ మార్గం లో వింత జీవులతో మాట్లాడాల్సి వస్తుంది. ఈ సైన్ ఫిక్షన్ అడ్వెంచర్ లో సాహస సన్నివేశాలు మరింత ఆకట్టుకొనున్నాయి.

సంబంధిత సమాచారం :