ఓటీటీలోకి వచ్చేస్తున్న “అనుభవించు రాజా”..!

Published on Dec 11, 2021 12:20 am IST


యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్, కశీష్‌ ఖాన్‌ హీరో హీరోయిన్లుగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ “అనుభవించు రాజా”. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరించారు. నవంబర్ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ఆహాలో రిలీజ్‌ అ‍య్యేందుకు రెడీ అయ్యింది.

ఈ సినిమాలో రాజ్ తరుణ్ ఊర్లో ఆవారాగా తిరిగే బంగార్రాజుగా మరియు సిటీలో సిన్సియర్‌గా సెక్యూరిటీ ఉద్యోగం చేసేవాడిగా రెండు వేరియేషన్స్‌లో కనిపిస్తాడు. డిసెంబర్‌ 17 నుంచి ఈ సినిమా ఆహాలో అందుబాటులోకి వస్తుంది. మరీ ఈ సినిమాను థియేటర్లలో చూడని వారు ఎవరైనా ఉంటే త్వరలోనే ఆహాలో చూసేయొచ్చు.

సంబంధిత సమాచారం :