“అనుభవించు రాజా” టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేసిన నాగ చైతన్య!

Published on Oct 11, 2021 4:00 pm IST

రాజ్ తరుణ్, కాశిస్ ఖాన్ ప్రధాన పాత్రల్లో శ్రీను గావిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం అనుభవించు రాజా. ఈ చిత్రం కి సంబంధించిన ఫస్ట్ లుక్, మరియు టీజర్ లు సినిమా పై ఆసక్తి ను పెంచేశాయి. తాజాగా ఈ చిత్రం నుండి టైటిల్ సాంగ్ ను అక్కినేని హీరో నాగ చైతన్య రిలీజ్ చేయడం జరిగింది.

భాస్కర భట్ల రాసిన ఈ పాటను రామ్ మిర్యాల పాడటం జరిగింది. ఈ పాట విడుదల అయిన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ పాట కి యూత్ నుండి విశేష స్పందన లభిస్తోంది. ఈ చిత్రం లో పోసాని కృష్ణమురళి, ఆడుకలం నరేన్, అజయ్, సుదర్శన్, టెంపర్ వంశీ, ఆదర్శ్ బాలకృష్ణ, రవి క్రిష్ణ, భూపాల్ రాజు, అరియాన లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వీలైన త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :