రిలీజ్ కి రెడీ అయిన “అనుకోని ప్రయాణం”

రిలీజ్ కి రెడీ అయిన “అనుకోని ప్రయాణం”

Published on Oct 2, 2022 5:52 PM IST

రాజేంద్ర ప్రసాద్, నరసింహ రాజు, ప్రేమ, తులసి, రవిబాబు, శుభలేఖ సుధాకర్, నారాయణ రావు, అనంత్, ప్రభాస్ శ్రీను, రంగస్థలం మహేష్, జోగి బ్రదర్స్, ధనరాజ్, కంచరపాలెం కిషోర్, జెమిని సురేష్, తాగుబోతు రమేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం అనుకోని ప్రయాణం. యాపిల్ క్రియేషన్స్ పతాకంపై డాక్టర్ జగన్ మోహన్ డి వై నిర్మిస్తున్న ఈ చిత్రానికి వెంకటేష్ పెదిరెడ్ల స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అందిస్తున్నారు.

ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చిత్ర యూనిట్ సరికొత్త పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. రిలీజ్ డేట్ ను ఈ సరికొత్త పోస్టర్ లో ప్రకటించడం జరిగింది. అక్టోబర్ 28, 2022 న థియేటర్ల లో ఈ చిత్రం ను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. నిర్మాత డాక్టర్ జగన్ మోహన్ ఈ చిత్రానికి కథను అందిస్తుండగా, పరచూరి బ్రదర్స్ డైలాగ్స్, ఎస్. శివ దినవాహి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు