విడుదల తేదీ : సెప్టెంబర్ 25, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
నటీనటులు : రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్, ప్రిన్స్ సిసిల్, అన్నయ్య, చరిత్, బ్రహ్మాజీ, రాసి, అజయ్, మస్త్ అలీ మరియు ఇతరులు
దర్శకత్వం : విమల్ కృష్ణ
నిర్మాతలు : రాజీవ్ చిలక, మేఘా చిలక్క, స్నేహ రాజేష్ జగ్తియాని, విహాన్ దండ్
సంగీతం : శ్రీచరణ్ పాకాల
ఛాయాగ్రహణం : సునీల్ కుమార్ నామా
కూర్పు : ఛోటా కె ప్రసాద్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో డీజే టిల్లు దర్శకుడు విమల్ కృష్ణ, యంగ్ హీరో రాగ్ మయూర్ కలయికలో వచ్చిన ఫన్నీ చిత్రం ‘అనుమాన పక్షి’ కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
వైజాగ్ కి చెందిన సన్నీ (రాజ్ మయూర్) ప్రతీ దానికి కొంచెం ఎక్కువగా ఆలోచిస్తూ, ప్రతీ విషయంలో అనుమానం వ్యక్తం చేస్తూ ఉంటాడు. అలాంటి తనకి అనుమాన పక్షి అనే ఓ ఛానెల్ కూడా ఉంటుంది. ఇదిలా ఉంటే కాశ్మీర్ లో ఉండే తన ఫ్రెండ్ అనంత్ (చరిత్) కాల్ చేసి చనిపోతానని బెదిరిస్తే తన కోసం సన్నీ ఇతర ఫ్రెండ్స్ కలిసి స్టార్ట్ అవుతారు. ఈ క్రమంలో సన్నీకి కన్యా కుమారి (మెరిన్ ఫిలిప్) పరిచయం అవుతుంది.తర్వాత తన ఫ్రెండ్ వర్మ (ప్రిన్స్) అనుమానాస్పదంగా చనిపోతాడు. దీనితో ఆ మరణానికి తానే కారణమేమోనని సన్నీ అనుమానించడం మొదలుపెడతాడు. ఈ క్రమంలో పోలీస్ ఇన్వాల్వ్మెంట్ జరగడం, ఆ తర్వాత ఏమైంది అనేది ఇందులో మిగతా కథ.
ప్లస్ పాయింట్స్:
టాలీవుడ్ యువ హీరోస్ లో రాగ్ మయూర్ కి మంచి కామెడీ టైమింగ్ ఉంది. దాన్ని ఇందులో తాను బాగా ప్రెజెంట్ చేసాడు. సన్నీ పాత్రలో అక్కడక్కడా మంచి ఫన్ సీన్స్ లో తాను షైన్ అయ్యాడు. కొన్ని కామెడీ సన్నివేశాలు బాగానే వర్కవుట్ అయ్యాయి.
అలాగే సినిమా నిడివి రెండు గంటల కంటే తక్కువగా ఉండటం కాస్త ఊరటనిచ్చే అంశం అని చెప్పాలి. కథనం వెళ్లిన తీరుకి ఈ రకంగా తక్కువ నిడివితో కట్ చేయడం ఒకింత మంచి విషయం.
మైనస్ పాయింట్స్:
ఈ సినిమాకి బేసిక్ బజ్ అయినా జెనరేట్ అవ్వడానికి ఉన్న ప్రధాన కారణాల్లో ఇది “డీజే టిల్లు దర్శకుడి నుండి వస్తున్న సినిమా” అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ‘అనుమాన పక్షి’ ఆ అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. సినిమా మొదలైన కొంత సేపటికే చూసే ఆడియెన్ కి విసుగు మొదలవుతుంది.
అసలు యువ హీరో రాగ్ మయూర్ ఈ కథను ఎందుకు ఒప్పుకున్నాడా అనే సందేహం రాకమానదు. తన రోల్ పై మరింత ఫన్ ని జెనరేట్ చేసే పాజిబులిటీ ఉంది కానీ ఈ సినిమాలో అది బాగా మిస్ అయ్యింది. అలానే ఇతర పాత్రలతో కూడా అంతగా కనెక్ట్ అవ్వలేం.
అంతే కాకుండా సరైన ఫ్లో లేకుండా కథనంలో సీన్స్ బలవంతంగా అతికించినట్లు ఉంటాయి. అలానే సినిమాను క్విర్క్ కామెడీగా ప్రెజెంట్ చేయాలని చూసినట్టు ఉన్నారు కానీ దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో రచయితలకే స్పష్టత లేదు. దాంతో ఆ సన్నివేశాలు ఆసక్తికరంగానో, నవ్వు తెప్పించేలాగో కాకుండా గందరగోళంగా మారాయి. సహజంగా నవ్వించే సన్నివేశాలు చాలా తక్కువ ఉంటాయి.
ఇక హీరోయిన్ పాత్రకు కూడా అంతగా ప్రాధాన్యత కనిపించలేదు. ఆమె స్క్రీన్ టైం చాలా తక్కువ ఉంది. రాశి, అజయ్, బ్రహ్మాజీ లాంటి ప్రముఖ నటీనటులు కూడా ఉన్నప్పటికీ వారిని సరిగ్గా వినియోగించుకోలేదు.
సాంకేతిక వర్గం:
ఈ చిత్రంలో నిర్మాణ విలువలు డీసెంట్ అని చెప్పొచ్చు. శ్రీచరణ్ పాకాల సంగీతం బాగుంది. సునీల్ కుమార్ కెమెరా వర్క్ కూడా ఓకే. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ సోసోగా ఉంది. మెయిన్ గా కథనంలో పస లేనందున తాను కూడా చేయడానికి పెద్దగా ఏమి లేదు.
ఇక దర్శకుడు విమల్ కృష్ణ విషయానికి వస్తే.. ముందు చెప్పినట్టుగా తన వర్క్ డెఫినెట్ గా అంచనాలు అందుకునే రేంజ్ లో లేదు. సినిమా అంతటా కనీసం ఒక్క సరైన ఎపిసోడ్‌ను కూడా ప్రేక్షకులకు అందించలేకపోయాడు. రైటింగ్, సీన్స్, నాచురల్ కామెడీ ఇవన్నీ బాగా లోపించాయి. వీటితో తన వర్క్ డల్ గా అనిపిస్తుంది.
తీర్పు:
ఇక మొత్తంగా చూస్తే, మొత్తంగా చూసుకుంటే ‘అనుమాన పక్షి’ థియేటర్స్ లో ఆడియెన్స్ సహనానికి పరీక్ష పెట్టే పేలవమైన చిత్రంగా మిగిలిపోయింది. రెండు గంటల లోపు రన్‌టైమ్, రాగ్ మయూర్ పంచిన లిమిటెడ్ ఫన్ మినహా సినిమాలో చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేవు. పస లేని కథనం, కృత్రిమంగా అనిపించే ఫన్ సీన్స్, సంబంధం లేని పాత్రలతో సినిమా డిజప్పాయింట్ చేస్తుంది. ముఖ్యంగా డీజే టిల్లు లాంటి మేజిక్ ఆశించి వెళ్తే ఆడియెన్స్ కి దర్శకుడు మాత్రం డిజప్పాయింట్ చేసే పంపుతాడు. సో ఈ సినిమా మెప్పించదు.
123telugu.com Rating: 2/5
Reviewed by 123telugu Team
