ఇంటెన్స్‌గా “ఎమర్జెన్సీ” నుండి అనుపమ్ ఖేర్ క్యారెక్టర్ పోస్టర్!

Published on Jul 22, 2022 3:00 pm IST


ఢాకాడ్‌ సినిమా తర్వాత బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ ఎమర్జెన్సీ అనే మరో సినిమాతో మళ్లీ రాబోతోంది. కొద్ది రోజుల క్రితం లాంచ్ అయిన ఈ సినిమాకు నటి స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజు, ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ క్యారెక్టర్ పోస్టర్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా నిలిచిన జేపీగా పేరున్న రాజకీయ నాయకుడు జయప్రకాష్ నారాయణ్ పాత్రలో ఆయన నటిస్తున్నారు.

ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తి గా కనిపిస్తోంది. ఎమర్జెన్సీలో శ్రేయాస్ తల్పాడే, భూమికా చావ్లా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మణికర్ణిక ఫిల్మ్స్ బ్యానర్‌పై రేణుపిట్టి, కంగనా రనౌత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2023లో థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :