ఇంట్రెస్టింగ్ గా అనుపమ “బటర్‌ఫ్లై” టీజర్

Published on Mar 3, 2022 12:30 pm IST

బబ్లీ నటి అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ లో బటర్‌ఫ్లైలో కనిపించనుంది. ఘంటా సతీష్ బాబు రచన మరియు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జెన్ నెక్స్ట్ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ఈరోజు ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. డైలాగ్ లేని టీజర్‌లో అనుపమ ఇద్దరు పిల్లలకు తల్లిగా కనిపించింది. ఒకరోజు, పిల్లలు తప్పిపోయారు మరియు ఆ తర్వాత, ఆమె వారి కోసం వెతకడం ప్రారంభించింది. తన పిల్లలను ఎవరు కిడ్నాప్ చేసారు, దాని వెనుక ఉన్న వ్యక్తిని అనుపమ ఎలా కనిపెట్టింది అనేది మనం మెయిన్ సినిమాలో చూడాల్సిన కథ.

అర్విజ్ మరియు గిడియన్ కట్టా నేపథ్యం టీజర్ ను మరింత ఆసక్తికరంగా మార్చింది. థ్రిల్లర్‌గా సినిమా ఉండబోతోందని టీజర్‌ను బట్టి తెలుస్తోంది. అనుపమకు ఛాలెంజింగ్ రోల్స్ లో ఇదొకటి అనేది టీజర్ చూసి చెప్పొచ్చు. నిహాల్ కొదటి కూడా సినిమాలో భాగమయ్యాడు. నటి భూమికా చావ్లా కీలక పాత్రలో కనిపించనుంది. బటర్‌ఫ్లై విడుదల తేదీని మేకర్స్ త్వరలో వెల్లడిస్తారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :