ఓటీటీ సమీక్ష : లాక్‌డౌన్ – అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్ చిత్రం

lockdown

ఓటీటీ వేదిక : అమెజాన్ ప్రైమ్ వీడియో
ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ : మార్చి 11, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు : అనుపమ పరమేశ్వరన్, చార్లీ, నిరోషా, ప్రియా వెంకట్, లివింగ్‌స్టన్, ఇందుమతి, రాజ్‌కుమార్ తదితరులు
దర్శకత్వం : ఏఆర్ జీవా
నిర్మాత : సుభాస్కరన్
సంగీతం : ఎన్ఆర్ రఘునాథన్, సిద్ధార్థ్ విపిన్
ఛాయాగ్రహణం : షెరిఫ్, శ్రీ గిరీష్
కూర్పు : విజె సబు జోసెఫ్

సంబంధిత లింక్స్ :  ట్రైలర్ 

అందాల భామ అనుపమ పరమేశ్వరన్ నటించిన రీసెంట్ తమిళ చిత్రం ‘లాక్‌డౌన్’ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. తమిళంతో పాటు తెలుగు డబ్బింగ్‌లోనూ ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

2020 నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అనిత(అనుపమ పరమేశ్వరన్) ఉద్యోగం కోసం వెతుకుతుంటోంది. ఆమె ఫ్రెండ్ ఒకరు తనకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ పార్టీకి తీసుకెళ్తారు. రెండు నెలల తర్వాత అనిత అనారోగ్యం బారిన పడినప్పుడు ఆమె గర్భం దాల్చినట్లు వెల్లడవుతుంది. దీంతో ఎవరికీ తెలియకుండా తన గర్భం తీయించుకోవాలని అనిత నిర్ణయించుకుంటుంది. అప్పుడే కరోనా లాక్‌డౌన్ విధించడంతో ఆమె తర్వాత ఏం చేస్తుందనేది ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

అనుపమ పరమేశ్వరన్ నటనపరంగా ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తుందో అందరికీ తెలిసిందే. ఆమె ఈ సినిమాలో కూడా తన పాత్రలో ఒదిగిపోయింది. తన కంట్రోల్‌లో లేని పరిస్థితులను ఆమె ఎలా ఎదుర్కొంది అనే పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఎలాంటి సాయం లేని, దీనమైన పాత్రలో అనుపమ మెప్పిస్తుంది.

మైనస్ పాయింట్స్ :

సినిమా ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే కథ ఎలా ఉండబోతుందో అందరికీ అర్థమవుతుంది. ఇలాంటి కథలకు మంచి కథనం బలంగా మారాలి. కానీ, ఈ సినిమాలో అలాంటి ఇంట్రెస్టింగ్ కథనం లోపించింది.

కొన్ని రిపీట్ సీన్స్, అవసరం లేని షాట్స్ మనకు ఈ సినిమాపై ఆసక్తిని తగ్గిస్తాయి. కొన్ని సీన్స్ ఎందుకు సాగదీశారా అని ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా ఉంటాయి. వీక్ రైటింగ్, పేలవమైన స్క్రీన్ ప్లే కారణంగా ఈ సీన్స్ ప్రేక్షకులను విసిగిస్తాయి.

సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసిన ఆర్టిస్టులు ఈ సినిమాలో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అనుపమకు క్లోజ్ ఫ్రెండ్ పాత్ర మాత్రమే సినిమాలో కొద్దిపాటి న్యాయం చేసినట్లు అనిపిస్తుంది. నిరోషా, చార్లీ తదితరులకు ప్రాధాన్యత లేని పాత్రలు దక్కినట్లు ఈ సినిమా చూస్తే అనిపిస్తుంది.

క్లైమాక్స్‌లో ఓ ట్విస్టు ఉన్నప్పటికీ, దానిని ఎగ్జిక్యూట్ చేసిన విధానం నీరసంగా అనిపిస్తుంది. ముగింపు కూడా సరిగా లేదని ప్రేక్షకులు ఫీల్ అవుతారు. ఈ చిత్ర నిడివి రెండు గంటలలోపు ఉన్నా, స్లో నెరేషన్ కారణంగా ఈ మూవీ సాగదీతగా అనిపిస్తుంది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు ఏఆర్ జీవా ఈ సినిమా ద్వారా ఓ మెసేజ్ ఇవ్వాలని ప్రయత్నం చేశారు. కానీ, కథను ఎగ్జిక్యూట్ చేసిన విధానం, వీక్ రైటింగ్ ఈ సినిమాపై తీవ్ర ప్రభావం చూపెట్టాయి. నిర్మాణ విలువల కూడా చాలా వీక్‌గా కనిపించాయి. తెలుగు డబ్బింగ్ ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది.

తీర్పు :

ఓవరాల్‌గా చూస్తే.. లాక్‌డౌన్ చిత్రం డిజప్పాయింట్ చేసే డ్రామాగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అనుపమ పరమేశ్వరన్ పర్ఫార్మెన్స్ మినహా సినిమాలో ఎలాంటి ఆసక్తికరమైన పాయింట్ లేకపోవడం మైనస్. టైట్ స్క్రీన్ ప్లే, మంచి ఎగ్జిక్యూషన్ ఉండి ఉంటే ఈ సినిమా రిజల్ట్ వేరేలా ఉండేది. ఎంగేజింగ్ కంటెంట్‌ను ఇష్టపడేవారు వేరే ఆప్షన్స్ చూసుకోవడం బెటర్.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team 

Exit mobile version