తన రిలేషన్ షిప్ పై ఓపెన్ అయ్యిన అనుపమ పరమేశ్వరన్.!

Published on May 31, 2022 9:00 pm IST

ప్రస్తుతం మన సౌత్ ఇండియన్ సినిమా దగ్గర ఉన్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ లలో తన కెరీర్ ఆరంభం నుంచే మంచి ఆఫర్స్ తో తెలుగు సహా ఇతర భాషల్లో నటిస్తూ వచ్చింది. ఇప్పుడు కూడా పలు సినిమాల్లో బిజీగా ఉన్న ఈ యంగ్ బ్యూటీ రీసెంట్ గా అయితే తెలుగులో “రౌడీ బాయ్స్” తో పలకరించింది. ఇక ఇదిలా ఉండగా ఈమె రీసెంట్ గా తన రిలేషన్ షిప్ పై ఓపెన్ అయ్యినట్టుగా తెలుస్తుంది.

ప్రస్తుతం ఈమె అయితే వన్ సైడెడ్ లవ్ లో ఉన్నానని, అయితే తన అభిప్రాయాన్ని అవతల వ్యక్తికి చెప్తే ఎలాంటి స్పందన వస్తుంది అనే దానిపై కాస్త కన్ఫ్యూజన్ లో ఉన్నానని చెప్పుకొచ్చింది. మొత్తానికి అయితే ఈమె ప్రేమలో ఉన్నాను అని కాకపోతే తన సైడ్ నుంచి ఉన్నానని క్లారిటీ ఇచ్చింది. మరి తాను ప్రేమించిన వ్యక్తి ఎవరో అవన్నీ తెలియాలి అంటే చాలా కాలమే పట్టేలా ఉందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :