అనుపమ ఆశ ఈసారైనా నెరవేరేనా ?

Published on Jul 27, 2019 3:00 am IST

తెలుగులో కథానాయకిగా ఒక్కో మెట్టూ ఎక్కుతూ వచ్చిన అనుపమ పరమేశ్వరన్ ‘శతమానం భవతి’ లాంటి భారీ విజయంతో నిలదొక్కుకుంది అనుకునే సమయానికి వరుస పరాజయాలు ఆమెను పలకరించాయి. ‘తేజ్ ఐ లవ్ యూ, ఉన్నది ఒక్కటే జిందగీ, క్రిష్ణార్జున యుద్దం’ లాంటి సినిమాలు వరుసగా ఫ్లాపయ్యాయి. దీంతో ఆమె కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. కొన్ని రోజులు తెలుగుకు బ్రేక్ ఇచ్చి కన్నడలో అదృష్టాన్ని పరీక్షించుకున్న ఆమె అక్కడ విజయం సాదించింది.

దీంతో మళ్లీ తెలుగుపై దృష్టి పెట్టి ‘రాక్షసుడు’ చిత్రానికి సైన్ చేసింది. ఇది తమిళ చిత్రం ‘రాట్చసన్’కు రీమేక్. వచ్చే నెల 2వ తేదీన విడుదలకానుంది. రమేష వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరో. ఈ చిత్రమైనా విజయం సాదిస్తే తెలుగులో తిరిగి పూర్వ వైభవాన్ని తెచ్చుకోవాలనుకుంటోంది అనుపమ. మరి ఆమె ఆశలు ఎంతవరకు నెరవేరుతాయో చూడాలి.

సంబంధిత సమాచారం :