లాయర్‌ గా కనిపించబోతున్న క్రేజీ హీరోయిన్ !

పవన్‌ వడయార్‌ దర్శకత్వంలో పునీత్‌రాజ్‌కుమార్‌ హీరోగా రూపొందుతున్న సినిమా ‘నటసార్వభౌమ’. ఈ చిత్రంలో పునీత్‌రాజ్‌కుమార్‌ సరసన అనుపమా పరమేశ్వరన్, రచితా రామ్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ లాయర్‌గా కనిపించనున్నారు. ఆమె క్యారెక్టర్ సినిమాకే హైలెట్ అవుతుందని చిత్రబృందం చెబుతుంది.

కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ కోల్‌కత్తాలో జరుగుతోంది. ఈ షెడ్యూల్స్‌లో పునీత్, అనుపమాలపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అలాగే మరో కొన్ని యాక్షన్ సన్నివేశాలతో పాటు.. రెండు సాంగ్స్‌ ను కూడా షూట్ చేయునున్నారు. డిసెంబర్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది.

ఇక అనుపమా పరమేశ్వరన్ ప్రస్తుతం నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ హీరో సరసన ‘హలో గురు ప్రేమ కోసమే’ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో అనుపమా ఇంజనీరింగ్‌ స్టూడెంట్‌ గా కనిపించనుంది. పైగా ఈ చిత్రంలో రామ్ – అనుపమా బావ మరదళ్లగా కనిపించనున్నారు. అనుపమా తండ్రి పాత్రలో ప్రకాశ్‌రాజ్‌ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్‌ 18న విడుదల చేయనున్నారు.

Exit mobile version