నాని హిట్ మూవీ తమిళ్ రీమేక్ లో అనుపమ

Anupama Parameswaran

నాచురల్ స్టార్ నాని,నివేదా థామస్ హీరో హీరోయిన్లుగా, మరో హీరో ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన మూవీ ” నిన్ను కోరి”. రెండేళ్ల క్రితం విడుదలై సూపర్ హిట్ అందుకున్న ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఐతే ఈ మూవీ ఇప్పుడు తమిళంలో రీమేక్ కానుందని సమాచారం.

అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుండగా హీరో అధర్వ నాని పాత్రలో కనిపించనున్నాడట. ఈ విషయాన్ని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న కన్నన్ స్వయంగా ఓ పత్రికతో పంచుకున్నారు. అలాగే ఈ చిత్రంలో అనుపమ పాత్రని ప్రొఫెషనల్ క్లాసికల్ డాన్సర్ గా మలచనున్నాడట డైరెక్టర్. “నిన్ను కోరి” చిత్రంలో వలే కీలక సన్నివేశాలు విదేశాలలో చిత్రీకరించాలని భావిస్తున్నారట. ఐతే ఆది పాత్ర కోసం ఎవరిని తీసుకోవాలనేది ఇంకా నిర్ణయయించలేదు అని అన్నారు.

Exit mobile version