మెగాస్టార్ అంటే మహా ఇష్టం అంటున్న యంగ్ బ్యూటీ…!

Published on Aug 5, 2022 3:00 am IST

త్రివిక్రమ్ తెరకెక్కించిన అఆ మూవీ ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు యువ భామ అనుపమ పరమేశ్వరన్. ఆ మూవీలో ఆమె పోషించిన నాగవల్లి పాత్రకు మంచి పేరు లభించింది. ఇక అక్కడి నుండి వరుసగా సినిమాలు చేస్తూ కొనసాగిన అనుపమ ప్రస్తుతం నిఖిల్ తో నటించిన మూవీ కార్తికేయ 2. ఈనెల 13న గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న అనుపమ మూవీ గురించి, తన సినీ కెరీర్ గురించి పలు విషయాలు వెల్లడించారు.

ఎంతో వ్యయప్రయాశలతో యూనిట్ మొత్తం కార్తికేయ 2 మూవీ తెరకెక్కించిందని, ఈ మూవీలో తన పాత్రకు రిలీజ్ తరువాత మంచి గుర్తింపు లభిస్తుందని, అలానే మూవీ కూడా మంచి విజయం అందుకుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు అనుపమ. అలానే ఆమె మాట్లాడుతూ, టాలీవుడ్ లో తనకు ఎంతో ఇష్టమైన నటుడు మెగాస్టార్ చిరంజీవి అని, ఆయన సినిమాలు తనకు ఎంతో ఇష్టం అని చెప్పుకొచ్చారు. అటువంటి టాప్ స్టార్ మూవీలో ఛాన్స్ వస్తే చాలు వెంటనే చేయడానికి రెడీ అన్నారు అనుపమ. గతంలో పలు సందర్భాల్లో కూడా అనుపమ, మెగాస్టార్ పై తన అభిమానాన్ని మాటల్లో చాటుకున్నారు.

సంబంధిత సమాచారం :