మెగా హీరో సినిమాకి సైన్ చేసిన అనుపమ పరమేశ్వరన్ !


‘అ.. ఆ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి అనుపమ పరమేశ్వరన్ ఆ తర్వాత ‘ప్రేమమ్, శతమానంభవతి’ వంటి చిత్రాలతో మరింత దగ్గరైంది. ప్రస్తుతం రామ్ ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ లో నటిస్తూ నాని సినిమాకి కూడా ఒప్పుకున్న ఈమె తాజాగా మెగాహీరో సినిమాకి కూడా సైన్ చేసినట్టు తెలుస్తోంది. ఆ మెగాహీరో మరెవరో కాదు సాయి ధరమ్ తేజ్.

ధరమ్ తేజ్ ఈరోజు ‘తొలిప్రేమ’ దర్శకుడు కరుణాకరన్ తో కొత్త చిత్రాన్ని ప్రారంభించనున్నాడు. తేజ్ సరసన అనుపమ అయితే బాగుంటుందని భావించిన దర్శక నిర్మాతలు ఆమెను ఫైనల్ చేశారట. ఇందులో అనుపమ పాత్ర చాలా కొత్తగా ఉంటుందని, నటనకు ఆస్కారమున్న పాత్రని కూడా తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత కెఎస్ రామారావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.