“18 పేజెస్” లో నందిని గా అనుపమ పరమేశ్వరన్ లుక్ అదిరింది గా!

Published on Sep 10, 2021 5:40 pm IST

నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం 18 పేజెస్. ఈ చిత్రం నుండి అనుపమ పరమేశ్వరన్ పాత్ర కి సంబంధించిన ఒక పోస్టర్ ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేయడం జరిగింది. నందిని గా పాత్ర ను ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్ లో అనుపమ న్యాచురల్ గా సూపర్ కూల్ గా ఉంది అని చెప్పాలి.

సుకుమార్ కథ, కథనం అందిస్తున్న ఈ చిత్రం పై మొదటి నుండి ఆసక్తి నెలకొంది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథ, కథనం అందిస్తుండటం, కుమారీ 21 ఎఫ్ చిత్రం తర్వాత పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అనుపమ ఈ చిత్రం తో పాటుగా మరో రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

సంబంధిత సమాచారం :