“అరుంధతి” మూవీపై అనుష్క ఎమోషనల్ పోస్ట్..!

“అరుంధతి” మూవీపై అనుష్క ఎమోషనల్ పోస్ట్..!

Published on Jan 17, 2022 10:30 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టికి కెరీర్‌లో గుర్తిండిపోయే చిత్రం “అరుంధతి” అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అనుష్క జేజేమ్మగా నటించి మెప్పించింది. అయితే ఈ చిత్రం విడుదలై నిన్నటికి 13 సంవత్సరాలు పూర్తి అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గుర్తు చేసుకున్న అనుష్క ఇన్‌స్టా వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

ఏ నటికైనా ఇలాంటి అవకాశం జీవితంలో ఒక్కసారే వస్తుందని, అరుంధతి సినిమాలోని జేజమ్మ పాత్ర నా జీవితంలో అలాంటిందేనని చెప్పుకొచ్చింది. నాకు ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన కోడి రామకృష్ణగారికి, శ్యామ్ ప్రసాద్ రెడ్డిగారికి, అరుంధతి టీమ్ మొత్తానికి ధన్యవాదాలు అని, ఇక ఈ సినిమాకు ప్రేక్షకులు అందించిన సపోర్ట్ మర్చిపోలేనిదని, ప్రేక్షకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు