ప్రభాస్ సరసన అనుష్క నటించడంలేదట ?
Published on Jul 24, 2017 8:58 am IST


రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సుజీత్ సింగ్ డైరెక్షన్లో ‘సాహో’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ రెగ్యులర్ షెడ్యూల్స్ ప్రకారం చక చకా జరుగుతున్నా కూడా ప్రభాస్ కు జోడీ ఎవరనేది నిశ్చయం కాలేదు. మొదట్లో కొందరు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల పేర్లు వినబడ్డా కొద్దిరోజుల నుండి అనుష్క పేరు బలంగా ప్రస్తావనకు వస్తోంది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ లక్కీ జోడీ మరోసారి తెరపై కనువిందు చేస్తుందనీయో ఆశపడ్డారు.

కానీ ఇంగ్లీష్ డైలీ కథనం ప్రకారం అనుష్క ఈ ప్రాజెక్ట్ చేయడంలేదని తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగులో ‘భాగమతి’ చేస్తున్న ఆమె ‘సాహో’ కంటే ముందే ఒక తమిళ సినిమాకు సైన్ చేశారు. త్వరలో ఆ షూట్ మొదలవుతుంది. దీంతో డేట్స్ క్లాష్ అయ్యే అవకాశముందని ఆమె ‘సాహో’ కు నో చెప్పిందట. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో ప్రతి నాయకుడిగా ‘కత్తి’ ఫేమ్ నీల్ నితిన్ ముఖేష్ నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని ప్రభాస్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని తెలుగుతో పాటు తమిళం, హిందీలో కూడా రూపొందిస్తున్నారు.

 
Like us on Facebook