ఆ సినిమాను తప్పక చూడాల్సిందే అంటున్న అనుష్క!


‘బాహుబలి-2’ సినిమాతో నేషనల్ సెలబ్రిటీ అయిపోయారు అనుష్క. ప్రస్తుతం ఆమె నుండి ఎలాంటి కామెంట్ వచ్చినా ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఇలాంటి తరుణంలో ఆమె ఒక సినిమా గురించి చేసిన కామెంట్ కూడా సెన్సేషన్ గా నిలిచింది. ఆ సినిమా మరేదో కాదు లేటెస్ట్ సంచలనం ‘అర్జున్ రెడ్డి’. తాజాగా సినిమాను వీక్షించిన స్వీటీ ప్రశంసలు కురిపించారు.

‘అర్జున్ రెడ్డి తప్పక చూడాల్సిన చిత్రం.. టీమ్ లోని ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు. ముఖ్యంగా నిర్మాతకు, దర్శకుడు సందీప్ వంగకు, విజయ దేవరకొండకు, షాలిని పాండే, రాహుల్ రామకృష్ణకు అభినందనలు’ అన్నారు. ఇలా దక్షిణాదిన ఉన్న స్టార్ హీరో హీరోయిన్లు, దర్శకులు, ఇతర సినీ ప్రముఖులంతా చిత్రాన్ని పొగడ్తలతో ముంచెత్తడంతో బోలెడంత పబ్లిసిటీ లభించి బాక్సాఫీస్ వద్ద చిత్రం నాన్ స్టాప్ గా దూసుకుపోతోంది.