‘సైరా’ సెట్లో ప్రమాదంపై అనుష్క వివరణ

Anushka Shetty

స్టార్ హీరోయిన్ అనుష్క ప్రస్తుతం ‘సైరా’ చిత్రంతో పాటు ‘సైలెన్స్’ అనే సినిమాలో కూడా నటిసున్న సంగతి తెలిసిందే. అయితే కొద్దిరోజులుగా అనుష్క ‘సైరా’ సెట్లో జరిగిన ప్రమాదంలో గాయపడిందని, ఆమె కాలికి బలమైన గాయం అయిందని, కోలుకోవడానికి ఇంకొన్ని రోజులు పడుతుందని వార్తలొచ్చాయి. అనుష్క కూడా బయట ఎక్కడా కనిపించకపోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. దీంతో ఆమె అభిమానులు కంగారుపడ్డారు.

దీన్ని గమనించిన అనుష్క ఇక ఊరుకుంటే సమస్య మరింత పెద్దదవుతుందని గ్రహించి తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, చాలా ఆరోగ్యంగా ఉన్నానని, హాయిగా విదేశాల్లో షూటింగ్ చేసుకుంటున్నానని క్లారిటీ ఇచ్చారు. దీంతో పుకార్లకు చెక్ పడి అభిమానులు రిలీఫ్ అయ్యారు.

Exit mobile version