ఆ ఫోటోలు పోస్ట్ చేయనందుకు ధన్యవాదాలు – అనుష్క శర్మ.

Published on Dec 19, 2021 11:28 pm IST

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఇద్దరూ తమ ముద్దుల కుమార్తె ‘వామికా కోహ్లీ’ ఫోటో ఎక్కడా బయటకు రాకుండా ఇన్నాళ్లు జాగ్రత్త పడ్డారు. కాగా తాజాగా తన కుమార్తె వామిక ఫోటోలను ఎక్కడా ప్రచురించనందుకు మీడియాకు ధన్యవాదాలు చెప్పింది అనుష్క శర్మ. ఆ మధ్య కోహ్లీ, అనుష్క వామికాతో కలిసి బయటకు వచ్చారు. ఆ సమయంలో మీడియా ప్రతినిధులు వామిక ఫోటోలను తీశారు.

అయితే, వామిక ఫోటోలను పోస్ట్‌ చేయకండని అనుష్క శర్మ ఒక మెసేజ్ పోస్ట్ చేస్తూ.. మీడియాని అభ్యర్థించింది. వాళ్ళు పోస్ట్ చేయలేదు. అయితే, దీనిపై స్పందిస్తూ అనుష్క తన ఇన్‌స్టాలో ఒక మెసేజ్ పోస్ట్‌ చేసింది. వామికా ఫోటోలు పోస్ట్‌ చేయనందుకు మీడియాకు కృతజ్ఞతలు. మేము మా చిన్నారి గోప్యతను కాపాడాలనుకుంటున్నాము. ఆమె జీవితాన్ని స్వేచ్ఛగా జీవించడానికే మేము మీడియాకు దూరంగా ఉంచుతున్నాము అంటూ అనుష్క శర్మ చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం :