వైరల్ : తన పెట్ తో ఎంజాయ్ చేస్తున్న అనుష్క ….!

Published on Jul 26, 2022 6:04 pm IST

టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ తో కొనసాగుతున్న వారిలో అనుష్క శెట్టి ఒకరు. ఇటీవల బాహుబలి సిరీస్ లోని రెండు సినిమాలతో పాటు భాగమతి, నిశ్శబ్దం సినిమాలతో మంచి విజయాలు సొంతం చేసుకున్న అనుష్క, త్వరలో యువ నటుడు నవీన్ పొలిశెట్టి తో తన నెక్స్ట్ మూవీ చేయనున్నారు. నూతన దర్శకుడు మహేష్ దర్సకత్వంలో రూపొందనున్న ఈ మూవీని యువి క్రియేషన్స్ సంస్థ నిర్మించనుంది.

ఇక మరోవైపు గత కొన్నాళ్లుగా ఎక్కువగా ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్న అనుష్క శెట్టి, తరచు తన వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు. ఇక నేడు తన పెట్ తో సరదాగా ఎంజాయ్ చేస్తున్న సెల్ఫీ వీడియోని ఇన్స్టాగ్రామ్ లో లవ్ ఎమోజితో పోస్ట్ చేసారు అనుష్క. ఆమె పోస్ట్ చేసిన ఆ క్యూట్ సెల్ఫీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారం అవుతుండడంతో అనుష్క ఫ్యాన్స్ కొందరు దానిని మరింతగా షేర్ చేసి వైరల్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :