ప్రభాస్ తో మూవీ పై అనుష్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published on Sep 6, 2023 1:05 am IST

టాలీవుడ్ స్టార్ నటీమణుల్లో ఒకరైన అనుష్క శెట్టి తాజాగా నటించిన మూవీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఈ మూవీ పై మొదటి నుండి ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన ఈ మూవీని యువ దర్శకుడు పి మహేష్ తెరకెక్కించగా యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ గ్రాండ్ గా నిర్మించారు. ఇక సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకి రానున్న ఈమూవీ గురించి తాజాగా హీరోయిన్ అనుష్క శెట్టి ఒక ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడారు.

మూవీ పై టీమ్ మొత్తానికి ఎంతో నమ్మకం ఉందని, తొలిసారిగా కథ విన్నపుడు తనకు ఎంతో బాగా నచ్చిందని, ప్రతి ఒక్క పాత్ర ఆడియన్స్ ని అలరిస్తుందని ఆమె అన్నారు. మరి మళ్ళి ప్రభాస్ తో మీరు సినిమా ఎప్పుడు చేస్తారు అనే ప్రశ్నకు ఈ విధంగా బదులిచ్చారు అనుష్క. నిజానికి మంచి కథ దొరికితే ఇప్పుడైనా ఆయనతో చేయడానికి రెడీ అని, తామిద్దరి మధ్యన మంచి స్నేహానుబంధం ఎప్పుడూ ఉంటుందని ఆమె తెలిపారు. ఇక తాజాగా అనుష్క విసిరిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రెసిపీ ఛాలెంజ్ ని పూర్తి చేసిన ప్రభాస్, ఆ ఛాలెంజ్ ని రామ్ చరణ్ కి అందించారు.

సంబంధిత సమాచారం :