‘లైగర్’ లేటెస్ట్ పోస్టర్ పై …. అనుష్క ఇంట్రెస్టింగ్ పోస్ట్

Published on Jul 2, 2022 5:02 pm IST

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే కలయికలో డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తీస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్ పాన్ ఇండియా మూవీ లైగర్. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తో కలిసి పూరి జగన్నాథ్ స్వయంగా నిర్మిస్తున్న లైగర్ నుండి కొన్నాళ్ల క్రితం రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ కి అందరి నుండి సూపర్ గా రెస్పాన్స్ లభించింది. ఇక నేడు ఈ మూవీ నుండి విజయ్ దేవరకొండ లేటెస్ట్ పిక్ ని రిలీజ్ చేసింది యూనిట్.

దానిపై అందరి నుండి బాగా రెస్పాన్స్ లభిస్తుండగా కొద్దిసేపటి క్రితం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి లైగర్ పోస్టర్ ని షేర్ చేస్తూ మూవీ టీమ్ కి బెస్ట్ విషెస్ తెలియచేసారు. పూరి జగన్నాథ్ గారి మ్యాజిక్ కోసం మరొక్కసారి ఎదురు చూస్తున్నానని, హీరో విజయ్ కి ఆల్ ది బెస్ట్ అని, నిర్మాత ఛార్మి మంచి విజయం అందుకోవాలని, ఇక ఎప్పుడూ మంచి సినిమాలను మనకు అందించిన కరణ్ జోహార్ దీనితో పెద్ద సక్సెస్ అందుకోవాలని, ఓవరాల్ గా లైగర్ మూవీకి పని చేసిన ప్రతి ఒక్క యాక్టర్, టెక్నీషియన్ కి ప్రత్యేకంగా ఆల్ ది బెస్ట్ విషెస్ తెలిపారు అనుష్క శెట్టి. కాగా ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం :