“మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” చిత్రాన్ని సక్సెస్ చేసినందుకు అందరికీ థాంక్స్ – అనుష్క శెట్టి!

Published on Sep 12, 2023 3:02 pm IST

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో, డైరెక్టర్ మహేష్ బాబు పి దర్శకత్వం లో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతూ, దూసుకు పోతుంది. ఈ చిత్రం ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు హీరోయిన్ అనుష్క శెట్టి థాంక్స్ తెలిపారు.

ఈ మేరకు వీడియో ద్వారా తన సందేశాన్ని అందించారు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రం పై చూపిస్తున్న ప్రేమకు ఆడియెన్స్ కి థాంక్స్. అయితే విమెన్ కోసం గురువారం నాడు తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో స్పెషల్ మార్నింగ్ షోస్ ను ప్రదర్శించనున్నట్లు అనుష్క పేర్కొన్నారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :