స్పెషల్ సాంగ్ చేయనున్న అనుష్క ?
Published on Jul 16, 2017 10:41 am IST


ఇన్నాళ్లు దక్షిణాది స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగిన అనుష్క ‘బాహుబలి -2’ ఘన విజయం తర్వాత జాతీయ స్థాయి హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. దీంతో ఆమె తర్వాతి ప్రాజెక్టుల విషయంలో అందరిలోనూ కుతూహలం నెలకొంది. ప్రస్తుతం ‘భాగమతి’ చిత్రంలో నటిస్తున్న ఆమె త్వరలో ఒక స్పెషల్ సాంగ్లో సందడి చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న ‘భరత్ అనే నేను’ చిత్రంలో కావడం విశేషం. ఈ మేరకు ఆమెతో చర్చలు జరిగాయని, కథతో పాటు పాటకు కూడా ప్రాముఖ్యత ఉండటంతో అనుష్క ఈ ఆఫర్ పట్ల సుముఖంగానే ఉన్నారని అంటున్నారు. అయితే ఈ విషయంపై ఇంకా పూర్తి స్థాయి అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తోంది.

 
Like us on Facebook