షూటింగ్ పూర్తి చేసుకున్న అనుష్క చిత్రం !


లేడీ సూపర్ స్టార్ అనుష్క ప్రధాన పాత్రలో ‘భాగమతి’ పేరుతో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. చాన్నాళ్ల క్రితమే మొదలైన ఈ ప్రాజెక్ట్ ఎట్టకేలకు షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుందట. నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించింది. అంతేగాక చిత్రానికి సంబందించిన ఇతర అప్డేట్స్ ను కూడా త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది.

‘పిల్ల జమిందార్’ ఫేమ్ అశోక్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం సప్సెన్స్ థ్రిల్లర్ గా ఉండనుంది. ఇందులో ప్రముఖ నటుడు ఆది పినిశెట్టి ప్రధాన ప్రతి నాయకుడి పాత్రను పోషిస్తున్నారు. ‘బాహుబలి’ తర్వాత అనుష్క నుండి వస్తున్న సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో, సినీ జనాల్లో మంచి క్రేజ్ నెలకొని ఉంది.