అనుష్క ‘భాగమతి’ కూడా ఊపందుకుంది..!

anushka
లేడీ సూపర్ స్టార్ అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘భాగమతి’ అనే సినిమా కొద్దిరోజుల క్రితమే సెట్స్‌పైకి వెళ్ళిన విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోన్న ఈ హిస్టారికల్ డ్రామా ప్రస్తుతం హైద్రాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే 25%పైనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఔట్‌పుట్‌పై టీమ్ చాలా హ్యాపీగా ఉందట. అనుష్కతో పాటుగా ఆది పినిశెట్టి, ఉన్ని ముకుందన్ తదితర స్టార్స్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమాకు అశోక్ దర్శకత్వం వహిస్తున్నారు.

మరికొద్దిరోజుల పాటు అన్నపూర్ణ స్టూడియోస్‌లో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాకు యూవీ క్రియేషన్స్ భారీగానే ఖర్చు పెడుతుందట. అనుష్క నటన, రోల్ హైలైట్‌గా నిలువనున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.