అనుష్క ‘భాగమతి’ ఫస్ట్ లుక్ ఎప్పుడంటే !
Published on Nov 5, 2017 5:17 pm IST

లేడీ సూపర్ స్టార్ అనుష్క నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘భాగమతి’ షూటింగ్ పనుల్ని పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. చాన్నాళ్ల క్రితమే మొదలైన ఈ ప్రాజెక్ట్ మధ్యలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురైనా కూడా ఎట్టకేలకు చివరి దశకు చేరుకుంది. ‘బాహుబలి’ తర్వాత అనుష్క నుండి వత్సున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం కావడంతో ఈ సినిమాపై మంచి క్రేజ్ నెలకొంది ఉంది.

అనుష్క ఐఏఎస్ అధికారిగా కనిపించనుందని చెప్పబడుతున్న ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను రేపు సాయంత్రం 6 గంటల 55 నిముషాలకు రిలీజ్ చేయనున్నారు. యువీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ‘పిల్ జమిందార్’ ఫేమ్ అశోక్ డైరెక్ట్ చేస్తున్నారు. ఆది పినిశెట్టి, ఉన్ని ముకుందన్ లు కూడా పలు కీలక పాత్రలు చేస్తున్న ఈ చిత్రాన్ని 2018 సంక్రాంతికి రిలీజ్ చేసే యోచనలో నిర్మాతలు ఉన్నారని వినికిడి.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook