మహి వి రాఘవ్ దర్శకత్వంలో దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జీవిత కథతో యాత్ర అనే బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో మలయాళ స్టార్ మమ్ముట్టి నటిస్తుండగా సబితా ఇంద్రారెడ్డి పాత్రకు సీనియర్ నటి సుహాసిని ఎంపిక చేశారు.
ఇప్పుడు తాజాగా మరో ముఖ్య పాత్ర కోసం ప్రముఖ యాంకర్ ,నటి అనసూయ ను తీసుకున్నారని సమాచారం. కర్నూల్ కు చెందిన దివగంత నేత భూమా నాగిరెడ్డి సతీమణి దివంగత శోభా నాగిరెడ్డి పాత్రలో ఆమె నటించనున్నారు .
ఇక ఈ చిత్రంలోని తదుపరి పాత్రల కోసం ప్రముఖ నటులను ఎంపికచేసే పనిలో వున్నారు ఈ చిత్ర యూనిట్. దాంట్లో భాగంగా సూరీడు పాత్రలో పోసాని కృష్ణ మురళిని తీసుకోగా విజయమ్మ పాత్రకు ,అస్రితను ఎంపిక చేశారు.
