రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న అన్య’ స్ ట్యుటోరియల్!

Published on Jun 24, 2022 11:00 pm IST

బాహుబలి ఫ్రాంచైజీని నిర్మించిన ఆర్కా మీడియా, అన్యస్ ట్యుటోరియల్ పేరుతో ఆసక్తికరమైన వెబ్ సిరీస్ కోసం OTT ప్లాట్‌ఫారమ్ ఆహాతో జతకట్టింది. ఈ సీరీస్ తెలుగు మరియు తమిళ భాషల్లో రానుంది. రెజీనా కసాండ్రా మరియు నివేదిత సతీష్ (సుజల్ ఫేమ్) ఈ సీరీస్ లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభించింది.

సైబర్ హారర్ థ్రిల్లర్ సిరీస్‌ను జూలై 1, 2022న ఆహా వీడియో లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అన్యస్ ట్యుటోరియల్, ఏడు ఎపిసోడ్‌ల సిరీస్‌కి పల్లవి గంగిరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌కు సౌమ్య శర్మ కథను అందించగా, విజయ్ కె చక్రవర్తి కెమెరా క్రాంక్ చేయగా, అరోల్ కొర్రేలి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :