నందమూరి బాలకృష్ణ నిర్మాణంలో క్రిష్ దర్శకత్వంలో మహానటుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్స్ లో మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ జనవరి 9న విడుదలై మంచి పాజిటివ్ టాక్ తో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.
కాగా ఇప్పటికే ‘కథానాయకుడు’ని చూసిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు బాలయ్య అద్భుతంగా నటించారంటూ.. దర్శకుడు క్రిష్ కూడా సినిమాని అద్భుతంగా తెరకెక్కించారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక నిన్న విజయవాడలో ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ‘కథానాయకుడు’ని చూశారు. ఈ సందర్భంగా చంద్రబాబు సినిమా పై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ.. ట్వీట్ చేశారు. ”ఎన్టీఆర్ సినిమా ఎనలేని స్ఫూర్తిని నింపింది. 30 ఏళ్ల చరిత్రను 3 గంటల్లో చూపి మహానటుడి జీవితాన్ని, త్యాగాన్ని, అకుంటిత కార్యదక్షతను ప్రజలకు అర్థమయ్యేలా చిత్రరూపమిచ్చిన దర్శకుడు క్రిష్, ఎన్టీఆర్ పాత్రలో ఒదిగిపోయిన బాలయ్యను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను” అని బాబు ట్వీట్ చేశారు.
ఎన్టీఆర్ సినిమా ఎనలేని స్ఫూర్తిని నింపింది. 30 ఏళ్ల చరిత్రను 3 గంటల్లో చూపి మహానటుడి జీవితాన్ని, త్యాగాన్ని, అకుంటిత కార్యదక్షతను ప్రజలకు అర్థమయ్యేలా చిత్రరూపమిచ్చిన దర్శకుడు @DirKrish, ఎన్టీఆర్ పాత్రలో ఒదిగిపోయిన బాలయ్యను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. #NTRKathanayakudu
— N Chandrababu Naidu (@ncbn) January 11, 2019
