టికెట్స్ రేట్స్, బెనిఫిట్స్ షోస్ ల పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!

Published on Nov 24, 2021 8:05 pm IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టికెట్స్ రేట్స్, బెన్ ఫిట్స్ షోస్, ఎక్స్ ట్రా షోస్ విషయం లో కీలక నిర్ణయం తీసుకుంది. బెన్ ఫిట్స్ షోస్, ఎక్స్ ట్రా షోస్ ఇక పై ఉండవు అని ప్రభుత్వం స్పష్టం చేసింది. టికెట్స్ ధరలను యధావిధి గా ఉంచడం జరిగింది. ఇక పై టికెట్ ధరలను ఆన్లైన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కి సంబందించిన పోర్టల్ లో కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

అయితే డిసెంబర్ నెల నుండి వరుస సినిమాలు విడుదల కానున్నాయి. అందులో పాన్ ఇండియా చిత్రాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తో ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలకు మాత్రమే కాకుండా, మిగతా సినిమాలకి కూడా త్వరగా రికవరీ అయ్యే అవకాశాలు తక్కువే అని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :