మరో టాలీవుడ్ నటుడుకి ఏపీ ప్రభుత్వం కీలక పోస్టింగ్!

మరో టాలీవుడ్ నటుడుకి ఏపీ ప్రభుత్వం కీలక పోస్టింగ్!

Published on Nov 3, 2022 4:30 PM IST

రీసెంట్ గా మన టాలీవుడ్ కి చెందిన ప్రముఖ కమెడియన్ అలాగే నటుడు ఆలీని ప్రస్తుత ఏపీ ప్రభుత్వం కీలక పోస్ట్ లో నియమించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా ఏపీ ప్రభుత్వం అయితే మరో కొత్త నిర్ణయం తీసుకోవడం సినీ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

మరి ఈసారి అయితే ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళిని ఏపీ సినిమా డెవలప్మెంట్ కార్పరేషన్ చైర్మన్ గా అయితే ముఖ్యమంత్రి నియమించినట్టుగా ఇపుడు వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై అయితే ఇంకా అధికారిక క్లారిటీ రాలేదు కానీ అతి త్వరలోనే రావచ్చని తెలుస్తుంది.

మరి మొత్తానికి అయితే టాలీవుడ్ లో కొందరి ప్రముఖ నటులకి ఏపీ గవర్నమెంట్ నుంచి మంచి పోస్టులే దక్కుతున్నాయని చెప్పాలి. మరి వారి విధి విధానాలు ఎలా ఉంటాయో రానున్న రోజుల్లో తెలుస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు