‘జై సింహ’ కు కూడా స్పెషల్ పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వం !

ఈ సంక్రాంతికి విడుదలకానున్న భారీ చిత్రాల్లో నందమూరి బాలక్రిష్ణ ‘జై సింహ’ కూడా ఒకటి. రేపు భారీస్థాయిలో రిలీజ్ కానున్న ఈ చిత్రం కోసం తెలుగు రాష్ట్రాల అభిమానులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. అందుకే థియేటర్ యాజమాన్యాలు, అభిమాన సంఘాలు స్పషల్ షోల కోసం ప్రభుత్వాన్ని కోరాయి.

ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించిన ఏపి ప్రభుత్వం రేపు 12వ తేదీ నుండి 16వ తేదీ వరకు అర్థరాత్రి 1 గంట నుండి ఉదయం 10 వరకు స్పెషల్ షోలు వేసుకోవచ్చని అనుమతులిచ్చింది. అధిక రద్దీని, శాంతి భద్రతల, బ్లాక్ మార్కెట్ సమస్యలను అధిగమించేందుకే ఈ అనుమతులని కూడా తెలిపింది. నిన్న విడుదలైన పవన్ ‘అజ్ఞాతవాసి’ కి కూడా ఏపి ప్రభుత్వం స్పెషల్ షోలకు అనుమతులిచ్చిన సంగతి తెలిసిందే.