ఈ మధ్యలో పెద్ద సినిమాల పరిస్థితేంటి ?

Published on Oct 24, 2021 5:30 pm IST

‘తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఉన్న సమస్యల్లో ఆంధ్రలో సినిమా టికెట్ రేట్ల వ్యవహారమే ఇప్పుడు అతి పెద్ద సమస్య అయిపోయింది. టికెట్ రేట్లు పెంచకపోతే.. పెద్ద సినిమాలకు నష్టం. అయినా టికెట్ రేట్ల పెంపు విషయంలో జగన్ సానుకూలంగా లేరని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఆ వార్తలు మరింతగా వైరల్ అవుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే 100% సీటింగ్ సామర్థ్యం అనుమతిస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, టికెట్ రేట్లు పెంపు విషయంలో మాత్రం జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు.

ఇక, టికెట్ రేట్ల పెంపు అనేది ఇప్పట్లో లేదని జగన్ ప్రభుత్వం నుంచి అందుతున్న సమాచారం. 100% ఆక్యుపెన్సీతో రోజుకు నాలుగు షోలకు అనుమతి ఇచ్చినంత తేలికగా టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వలేమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయట. పైగా స్వయంగా ప్రభుత్వమే ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. కానీ మరో ఏడాదికి.. అంటే 2022 వేసవి కాలానికి గానీ ఈ పోర్టల్ అందుబాటులోకి రాదు.

అప్పుడు టికెట్ రేట్లు కొంతవరకు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలుస్తోంది. మరి ఈ మధ్యలో విడుదల అవుతున్న పెద్ద సినిమాల కలెక్షన్స్ పరిస్థితి ఏమిటి అనేది చూడాలి ?

సంబంధిత సమాచారం :