గుడ్ న్యూస్: ఏపీలో రేపటి నుంచి 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు..!

Published on Oct 13, 2021 9:57 pm IST


కరోనా కారణంగా మూతపడ్డ థియేటర్లు కొన్ని చోట్ల మళ్ళీ తెరుచుకుని వంద శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నా, ఏపీలో మాత్రం ఇంకా వంద శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరుచుకోలేదు. దీంతో టాలీవుడ్‌లో కొన్ని సినిమాలు ఓటీటీల్లో రిలీజ్ కాగా, మరికొన్ని సినిమాలు రిలీజ్ డేట్లను వాయిదా వేసుకున్నాయి. అయితే వంద శాతం ఆక్యుపెన్సీపై తాజాగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఇకపై ఏపీలో థియేటర్లను వంద శాతం ఆక్యుపెన్సీతో నడపుకోవచ్చని ప్రకటన జారీచేసింది. వంద శాతం ఆక్యుపెన్సీ నిర్ణయం రేపటి నుంచే అందుబాటులోకి రానున్నట్టు జీవో ద్వారా తెలిపింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో థియేటర్‌ యజమానులు, సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :