ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్ల పై ఇచ్చిన జీవో రద్దు… రాబోయే సినిమాలకు అడ్వాంటేజ్

ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్ల పై ఇచ్చిన జీవో రద్దు… రాబోయే సినిమాలకు అడ్వాంటేజ్

Published on Dec 14, 2021 4:48 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో గత కొద్ది నెలలుగా సినిమా టికెట్ల ధరల విషయం లో సినీ పరిశ్రమ అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 35 పై ధియేటర్ యజమానులు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ను ఆశ్రయించడం జరిగింది. నేడు దీని పై ఉన్నత న్యాయస్థానం లో వాదనలు జరిగాయి. కోర్ట్ ఇచ్చిన ఆదేశాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో విరుద్ధం గా ఉంది అంటూ ధియేటర్ యాజమానుల తరపు న్యాయవాదులు వాదించారు. టికెట్ల ధరల రేట్లను తగ్గించే అధికారం రాష్ట్ర ప్రభుత్వం కి లేదు అని స్పష్టం చేయడం జరిగింది.

వాదనలు విన్న అనంతరం కోర్టు జీవో ను రద్దు చేస్తూ ఆదేశాలను జారీ చేయడం జరిగింది. ఇక పై సినిమా టికెట్ రేట్లు యథాతథం గా ఉండనున్నాయి. కోర్ట్ తీసుకున్న ఈ నిర్ణయం తో రాబోయే భారీ చిత్రాలు అయిన పుష్ప, ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, రాధే శ్యామ్ లకి అడ్వాంటేజ్ అని చెప్పాలి. మిగతా చిత్రాలకి సైతం ఈ నిర్ణయం సంతోషకరం గా ఉంటుంది అని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు