‘మా’ ఎన్నికలకు ప్రభుత్వానికి సంబంధం లేదు – మంత్రి పేర్ని నాని

‘మా’ ఎన్నికలకు ప్రభుత్వానికి సంబంధం లేదు – మంత్రి పేర్ని నాని

Published on Oct 4, 2021 4:00 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి జరుగుతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి గానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గానీ ఎటువంటి సంబంధం లేదని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.

కాగా సోమవారం మధ్యాహ్నం ఆయన మాట్లాడుతూ, అక్టోబ‌రు 10న జరగనున్న మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (జరిగే ఎన్నికలకు ప్రభుత్వానికి, జగన్మోహనరెడ్డికి ఏ మాత్రం ఆసక్తి,, ఉత్సాహం లేదని ఈ మేరకు తెలుగు సినిమా పరిశ్రమ వర్గాలందరికి విజ్ఞప్తి చేస్తున్నట్లు మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. ఉప సంచాలకులు , కృష్ణాజిల్లా సమాచార , పౌర సంబంధాల శాఖ మచిలీపట్నం వారిచే జారీ చేయబడింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు